అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, శోభనాద్రిపురం గ్రామ శివారులో ఉన్న మూసి వాగు నుండి అక్రమంగా, దొంగతనంగా ఇసుకను తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామన్నపేట ఎస్సై డి.నాగరాజు, రామన్నపేట ఎస్సై, పోలీసు సిబ్బంది కలిసి శోభనాద్రిపురం గ్రామ శివారు వెళ్లి ఎటువంటి ఇసుక రవాణా అనుమతులు లేని ఇసుక లోడులతో ఉన్న మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట నాగరాజు తెలిపారు.



