సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
On
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కావలి దశరథ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ని హరినాథ్ కి అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా కావలి దశరథ మాట్లాడుతూ, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో గణపురం రాజు, గ్రామ శాఖ అధ్యక్షులు , ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎండి అన్వార్ వైస్ ప్రెసిడెంట్,మాజీ వార్డు సభ్యులు కొత్తపల్లి సిద్దులు గౌడ్,షేకర్ ఖాన్ ఎన్ఎస్ యుఐ మహేశ్వరం గాజులపల్లి నర్సింహా, తదితరులు పాల్గొన్నారు.



