బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

విశ్వంభర, సిద్దిపేట: చిన్నకోడూరు మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన నక్క చరణ్ అనే యువకుడు మృతిచెందడంతో బాధిత కుటుంబాన్ని యువ నాయకుడు, పారిశ్రామికవేత్త వంగ రాజేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. చిన్న వయసులోనే చరణ్ మృతిచెందడం దురదృష్టకరమని, కుటుంబానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేశారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. తన వంతుగా రూ.10వేల ఆర్థికసాయం అందించారు.

Tags: