పుట్టిన పిల్లలకు తల్లిపాలే ఆరోగ్యం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల్ తుక్కుగూడ లో పోషణ పక్వాడలో భాగంగా ఐ .సి .డి ఎస్ .ప్రాజెక్ట్ మహేశ్వరం తుక్కుగూడ, మంకల్ గ్రామంలో సిడిపిఓ శాంతి ఆధ్వర్యంలో తల్లిపాలపై సంరక్షకులకు సూచనలు రెండవ నెల బాలింతల గృహ సందర్శన చేసి మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి తెలియజేయడం జరిగింది. బిడ్డకు పుట్టగానే మురుపాలను వెంటనే గంట లోపలనే పట్టించాలి, మురుపాలలో ఉండే లాభాల గురించి తెలియజేయడం జరిగింది. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఎలాంటి ద్రవపదార్థాలు కూడా బిడ్డకు ఇవ్వకూడదు, తల్లిపాల వల్ల బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఇమ్యూనిటీ పిల్లల్లో రోగ నిరోధక శక్తి ఉంటుంది,బిడ్డకు తల్లిపాల్లో కావలసిన పోషకాలు ద్రవపదార్థాలు అన్ని తల్లిపాలలో ఉంటాయి ఎలాంటి ఇతర ఆహారము ద్రవ పదార్థాలను బిడ్డకు ఇవ్వకుండా కేవలం ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఆరు నెలలు నిండిన తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారాన్ని ఇవ్వడం గురించి తెలియజేయడం జరిగింది. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి మానసికంగా ప్రశాంతంగా ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా ఆ ప్రశాంతమైన వాతావరణం లో ఉండాలే అంగన్వాడీ కేంద్రంలో పేరు నమోదు చేయించుకుని ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని కూడా ప్రతి తల్లి వినియోగించుకోవాలి, గర్భిణిగా ఉన్నప్పటినుండి డెలివరీ అయ్యే వరకు గర్భిణీ ప్రతినెల బరువు పెరగాలే ప్రతి నెల హెల్త్ చెకప్స్ కూడా చేయించుకోవాలి . బిడ్డ పుట్టినప్పటి నుండి సరైన సమయంలో టీకాలను ఇప్పించాలి,బిడ్డకు 9వ నెలలో విటమిన్ ఏ ఇప్పించాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి బిడ్డకు విటమిన్ ఏ వేయించాలి, ఈ విషయాలను ఐసిడిఎస్ సిడిపిఓ శాంతి తల్లులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎన్ఎం అలివేలు, ఐసిడిఎస్ సూపర్వైజర్ విద్యావతి ,అంగన్వాడీ టీచర్ వెంకటేశ్వరి, నిర్మల, తల్లులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.



