మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సహాయం 

విశ్వంభర, తొరూరు:  తొర్రూరు జెడ్పి హెచ్ ఎస్ పాఠశాలలో పదవ తరగతి 1985-86 బ్యాచ్ కు చెందిన మండలంలోని మడిపల్లి గ్రామవాసి మహంకాళి మైసయ్య అకాల మరణం చెందడంతో గురువారం ఆ బ్యాచ్ మిత్రులు అందరు కలిసి రూ. 52,000 నగదు , 25 కేజీల బియ్యం, కిరాణా సామాన్లు అందించారు. ఈ కార్యక్రమంలో పెరుమాండ్ల రవి, వలపు మధుసూదన్, రామ్మోహన్ రెడ్డి, సర్వి వెంకన్న, బందు శీను, టీ.సురేందర్, కృష్ణమూర్తి, కొమరమల్లు, వెంకన్న, మల్లయ్య , అల్లా బాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags: