బాధిత కుటుంబానికి బీజేపీ చేయూత

బాధిత కుటుంబానికి బీజేపీ చేయూత

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన వరిపల్లి రాము ఇటీవల మృతి చెందాడు.. ఆయన దశదినకర్మ పూరస్కరించుకొని బిజెపి పార్టీ జిల్లా కార్యదర్శి దారా హిందుభారతి, మండల అధ్యక్షులు చందు రాజకుమార్ యాదవ్, రాసయాకిరెడ్డి తదితర నాయకులు హాజరై రాము చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.20 వేలు అందజేశారు. ఈ సందర్భంగా హిందూ భారతి మాట్లాడుతూ, చిన్న వయసులోనే రాము అస్తమయం చెందడం బాధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నేత నల్లాని పాపారావు,ముస్తఫా,జల్లె రమేష్, విజేందర్, రామచంద్రు,మహేష్,తోటరమేష్,జిలకరయాకన్న,జి.యాకన్న,సాయి,శీను,కృష్ణ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: