డీ సిల్టింగ్ పనులు వేగవంతం చేయాలి: హైడ్రా కమిషనర్
On
విశ్వంభర, హైదరాబాదు : నాలాలు, వరద కాలువల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగిస్తే వర్షాకాలంలో వరద ముప్పు తగ్గుతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైదరాబాదు లోని రహ్మత్‌నగర్, కృష్ణానగర్, అమీర్‌పేట, గాయత్రినగర్ ప్రాంతాల్లో గురువారం డీ సిల్టింగ్ పనులను పరిశీలించారు. వర్షాలు మొదలయ్యేలోపు పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే అడ్డంకులు తొలగించి ప్రవాహానికి మార్గం కల్పించాలని సూచించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. డివిజన్ వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి పనుల పురోగతిపై సమాచారం అందించాలని కాలనీ ప్రతినిధులను కోరారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.



