రోడ్లపై ధాన్యం ఆరబోయ వద్దు

రోడ్లపై ధాన్యం ఆరబోయ వద్దు

  • రైతులకు పోలీసుల విజ్ఞప్తి 

 విశ్వంభర, సూర్యాపేట: రైతులు రోడ్లపై ధాన్యము ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నదని, రైతులు ధాన్యం రోడ్లపై ఆరబోయడం ప్రమాదకరమని, ఎవరు కూడా రోడ్లపై ధాన్యాన్ని ఆరబోయవద్దని జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో కోరారు. ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు అన్నారు. కావున రైతులు గమనించి సహకరించాలి అన్నారు. రైతులు రోడ్లపై ఆరబోసిన ధాన్యం కప్పను వాహనదారులు గమనించక  ప్రమాదాలకు గురౌతు ప్రాణాలు కోల్పోతున్నారు, క్షతగాత్రులు అవుతున్నారు అని ఎస్పి గుర్తు చేశారు. ధాన్యం అరబోయడం వల్ల ప్రమాదాలు జరిగి ఎవ్వరూ ప్రాణాలు కోల్పోవద్దు అని కోరారు, కావున రైతులు గమనించి రోడ్లపై ధాన్యం. ఆరబోయవద్దు అని విజ్ఞప్తి చేశారు. పోలీసు సూచనలు పాటిస్తూ సహకరించాలి అన్నారు. పోలీసు అధికారులు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాత్రి వేళ పశువులను వదిలి పెట్టవద్దు అని ఎస్పీ కోరారు, వేసవి కాలంలో మేతకోసం పశువులను వదిలిపెట్టడం వల్ల అవి రోడ్లపై వస్తున్నాయి వాహనదారులు గమనించక ప్రమాదాల బారిన పడుతున్నారు అన్నారు.

Tags: