పాల బిల్లుల కోసం రైతుల ధర్నా

పాల బిల్లుల కోసం రైతుల ధర్నా

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలోని పాడి రైతులు నాలుగు నెలలుగా రాని తమ పాల బిల్లుల కోసం గురువారం రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించినారు. గత నాలుగు నెలల నుంచి పాల బిల్లులు రాక రైతులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అసలే ఎండాకాలం దానా ఖర్చులు పెరిగినాయి, నాలుగు నెలల నుంచి బిల్లులు  రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రైతుల పాల బిల్లులు చెల్లించాలని, రైతును ఇబ్బందుల పాలు చేయడం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం చైర్మన్ దొంతరబోయిన శివలీల దాసు, డైరెక్టర్లు నోముల పద్మ రామలింగం, ఆవుల సైదమ్మ భగవంతం, రైతులు ఏబిసి కిష్టయ్య, కన్నెబోయిన నరసింహ, కొత్త పరుశురాం, మనకుంట్ల లింగయ్య, రేవణాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: