1.09కేజీల గంజాయి పట్టివేత
On
విశ్వంభర, జిహెచ్ఎంసి : రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏ టీమ్ సీఐ బాలరాజు సిబ్బంది కలిసి ఘటేస్కర్ మండలం మక్తా విలేజ్‌లోని నర్మాద హోమ్స్ లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1.09 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో షేక్ సహీద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడి తోపాటు గండా సత్యసాయి, తోగరు అక్షిత్ పటేల్, ఇంద్రావత్ లోకేష్ నాయక్‌లపై కేసు నమోదు చేశారు. ఈ నలుగురు పాడేరు నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఘట్కేసర్‌లో అమ్మకాలు జరుపుతున్నారని అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ తెలిపారు.



