స్త్రీ, శిశు, మాత సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
- క్షేత్రస్థాయిలో అంగన్వాడి సేవల బలోపేతానికి మొబైల్ ఫోన్ల పంపిణీ
- మంత్రి దనసరి అనసూయ
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ పట్టణంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభించి, అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ, పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు డాక్టర్ భూక్య మురళి నాయక్, కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి లతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ ప్రారంభించారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలో స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ను ప్రారంభించారు. వృద్ధుల సంరక్షకులకు జీవనశైలి మెరుగుపడడం కోసం ఉపయోగపడుతుందని వారి యొక్క ఒంటరితనాన్ని పోయి సంతోషంగా ఉండటం కోసం రూపొందించబడిన ఈ కేంద్రం ద్వారా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని వయోవృద్ధులు వివిధ క్రీడలలో పాల్గొనవచ్చని, తద్వారా మానసిక ప్రశాంతతబి ఉల్లాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, జిల్లాలో సుమారు 12 లక్షల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ కేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పిల్లలు ప్రేమగా చూసుకోవాలని, వారిని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వదిలేయడం తగదని సూచించారు. ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ బలోపేతం కోసం రాష్ట్రవ్యాప్తంగా వయవృద్ధులు, గర్భిణీలు , బాలింతలు, చిన్నపిల్లలకు వివిధ పథకాలను ప్రవేశపెట్టి వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు 1368 మొబైల్ ఫోన్ల పంపిణీ చేయడం జరిగిందని తద్వారా క్షేత్రస్థాయిలో డిజిటల్ విధానంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే పథకాలు పౌష్టిక ఆహారం, స్థితిగతులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయడం పారదర్శకంగా పాలన కొనసాగుతుందన్నారు. పోషణ్ పఖ్వాడా కార్యక్రమాన్ని మహబూబాబాద్ కేంద్రంగా ఈరోజు నుండి ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహార పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు, ఆహార పంపిణీ అంశాలను నమోదు చేయవచ్చని, దీని ద్వారా పారదర్శకత పెరుగుతుందని ఆమె తెలిపారు. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం వృద్ధుల సంక్షేమం కోసం చరిత్రా త్మకమైన నిర్ణయం తీసుకొని శాసనసభలో వృద్ధుల సంక్షేమ చట్టం ప్రవేశపెట్టి అమలుపరచినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ లో డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని, రిటైర్డ్ ఉద్యోగులు వయవృద్ధుల కోసం ఇక్కడ వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరారు. ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, సభను ఉద్దేశించి ప్రసంగించి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు ముందుకు సాగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె. అనిల్ కుమార్, జిల్లా వెల్ఫేర్ అధికారిని సబిత, సిడిపిఓలు శిరీష, సంబంధిత విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



