పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
On
విశ్వంభర, బచ్చన్నపేట: అనారోగ్యంతో జీవితం పై విరక్తి చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహాత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలోని కట్కూర్లో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు బాల నరసయ్య (48) గత కొంత కాలంగా కిడ్నీ సంబందిత వ్యాదితో భాదపడుతున్నాడు. ప్రతీ నెలా నీలిమా ఆసుపత్రికి వెల్లి మందులు తెచ్చుకుంటున్నాడు. అయినా కూడ ఆరోగ్యం కుదుట పడడం లేదు. దాంతో తీవ్ర మరస్తాపం చెంది తరచూ ఇంట్లో వాళ్లతో తాను పురుగుల మందు తాగి చనిపోతా, చనిపోతా అని అంటుంటే వాడని వెల్లడించారు. గురువారం ఉదయం తాను చనిపోతా అంటూనే గడ్డిమందు తాగాడు. పరిస్తితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా దవాఖానాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మద్యాహ్నం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.



