అర్హులందరికీ సంక్షేమ పథకాలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

  •  ఎమ్మెల్యే యాదయ్య

విశ్వంభర, షాబాద్: షాబాద్ మండల పరిధిలోని రేగడి దోస్వాడ గ్రామానికి చెందిన గడీల బాలమణి  భర్త జంగయ్యకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కును చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ, పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, రేగడి దోస్వాడ గ్రామ సర్పంచ్ పావని రమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags: