బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ 

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా భోగారం గ్రామంలో గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గడప గడపనా ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని "మన ఊరు మనబడి" అనే నినాదంతో పలువురు విద్యార్థిని విద్యార్థులను పాఠశాలలో నూతన అడ్మిషన్స్ వేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ ముక్తకంఠముతో మన పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని మన గ్రామ పిల్లలను మన పాఠశాలను చేర్పించాలని ఉన్న ఉపాధ్యాయ బృందంతో పాటు ఈ సంవత్సరం విద్యా వాలంటీరును ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పిల్లల చదువు కొరకై పాటుపడాలని చదువుకు సంబంధించిన ప్రతి విషయంలో తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని అదేవిధంగా గ్రామస్తులు కూడా సహకరించాలని పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, వార్డు సభ్యులు నేరటి మానస సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముసుకు వెంకటరెడ్డి, గ్రామ యువత, తదితరులు పాల్గొన్నారు.

Tags: