అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ వడ్డేపల్లి లోని జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ లో శ్రీ రామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రకాళి వేద పాఠశాల పండితులు హరిప్రసాద్ శర్మ, భాగ్యనగర్ వేద భవన్ వేద పండితులు మణికంఠ శర్మ శ్రీ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీరామచంద్రుడి పక్షాన విజయలక్ష్మి, సీతమ్మ తల్లి పక్షాన డాక్టర్ గోపిశ్రీ సుధీర్ దంపతులు పాల్గొని కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు.ఈ కార్యక్రమంలో జిఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు దయాకర్ రెడ్డి, స్వర్ణకుమార్,కోశాధికారి దొంగరి నవీన్ కుమార్ తో పాటు కమిటీ సభ్యులు, ఆరు వందలకు పైగా నివాసితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆలపించిన పాటలు చేసిన శాస్త్రీయ నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.



