హెచ్‌ఆర్‌ఏ పెంపునకు డిమాండ్
On
విశ్వంభర, హైదరాబాదు : నూతనంగా అప్ గ్రేడ్ అయిన మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ) పెంపు చేయాలని టీఎస్ యుటీఎఫ్ నాయకులు కోరారు. కార్పొరేషన్లకు 17 శాతం, మునిసిపాలిటీలకు 13 శాతం హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండవ వేతన సవరణ సంఘం చైర్మన్ శివశంకర్, సభ్యుడు రామయ్యలను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కార్యాలయంలో కూడా ఇదే డిమాండ్‌తో మరో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ , 2023 నాటి పరిస్థితుల ఆధారంగా సిఫారసులు చేస్తామని, తర్వాత అప్గ్రేడ్ అయిన నగరాలు, పట్టణాలకు జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేసే అవకాశాన్ని సూచిస్తామని తెలిపారు. పూర్వ పీఆర్‌సీ జీఓ ప్రకారం అర్హతగల ప్రాంతాలకు పెంచిన హెచ్‌ఆర్‌ఏ వెంటనే అమలు చేయాలని కోరారు.



