అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి చర్యలు
On
విశ్వంభర, గోల్నాక : అంబర్‌పేట్ నియోజకవర్గంలోని అంగన్వాడి కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. హైదరాబాదు గోల్నాకలో గురువారం జరిగిన కార్యక్రమంలో టీచర్లకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. 34 కేంద్రాల్లో మౌలిక వసతుల మెరుగుదల, శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. చిన్నారులకు విద్య, పోషకాహారం, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఖాళీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్, తాగునీటి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది, స్థానిక నాయకులు గండికోట జనార్ధన్, బుచ్చిరెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



