మ్యాథ్స్ ఒలింపియాడ్ లో స్వాతి రెడ్డి ప్రతిభ
On
విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం పట్టణంలోని శ్రీవిద్య స్కూల్‌కు చెందిన విద్యార్థిని సి. స్వాతి రెడ్డి యునిఫైడ్ కౌన్సిల్ నిర్వహించిన యునిఫైడ్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పరీక్షలో అద్భుత ప్రతిభ కనబరిచి స్కూల్ టాపర్‌గా నిలిచి ప్రైజ్ మనీ సాధించింది. ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఆమె ప్రదర్శించిన మెరుగైన ప్రతిభకు స్కూల్ యాజమాన్యం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శ్రీవిద్య స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు స్వాతి రెడ్డిని అభినందిస్తూ, ఆమె కృషి, పట్టుదల ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీ పరీక్షలు ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులు ఎక్కువగా పాల్గొని తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని స్కూల్ యాజమాన్యం సూచించింది.



