అమ్మవారికి కమిషనర్ ప్రత్యేక పూజలు 

అమ్మవారికి కమిషనర్ ప్రత్యేక పూజలు 

 విశ్వంభర, జిహెచ్ఎంసి :ఆబ్కారీ భవన్‌లో కొలువైన శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ ప్రత్యేక  పూజలు నిర్వహించారు. ఆబ్కారీ భవన్‌లో కొవులవైన ఆబ్కారీ భవన్‌లో శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలు  గురువారం ఘనంగా జరిగాయి. దేవాలయంలో వేద పండితులతో గురువారం ఉదయం 6 గంటల  నుంచి లలిత త్రిపుర సుందరి అమ్మవారికి అభిషేకాలు, గణపతి పూజ కార్యకమ్రాలు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి 12  గంటల వరకు చండీ హోమం నిర్వహించారు.హోమ  గుండం వద్ద, అమ్మవారి దేవాలయంలో కమిషనర్ సి.హరికిరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు  ఆశ్వీరాదాలు కమిషనర్‌కు అందించారు. కమిషనర్‌తోపాటు దేవాలయ కమిటీ సభ్యులు డీసీ కృష్ణప్రియ,టీజీబీసీఎల్ అసిస్టెంట్  మేనేజర్ విజయలక్ష్మీ,  విజయ, జ్ఞానేశ్వర్‌తో ఆబ్కారీ భవన్‌లోని  డిప్యూటి  డీసీలు, ఏసీలు, ఈఎస్‌లు, సీఐలు, సిబ్బంది పాల్గోన్నారు.  ఈ కార్యక్రమానికి  టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు మారం జగదీశ్వర్, ముజీబ్  హెస్సెనీ, కస్తూరి వెంకట్వేర్లు, కట్కూరీ శ్రీకాంత్ ఇతర ఉద్యోగులు  హాజరయ్యారు.  అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి 16వ వార్షికోత్సవం  సందర్భంగా ఆబ్కారీ భవన్‌లో ఉద్యోగులందరికి తీర్థ ప్రసాదాలతో  పాటు అన్నదానం ఏర్పాటు చేశారు.

Tags: