యడవల్లి సైదులుకు ఓ. యూ. డాక్టరేట్
ఉస్మానియా విశ్వ విద్యాలయం,తెలుగు శాఖ లో పిహెచ్. డి చేస్తున్న యడవల్లి సైదులు కు డాక్టరేట్ ప్రకటించారు.పరిశోధకుడు " రాళ్ళబండి కవితాప్రసాద్ రచనలు పరిశీలన " అనే విషయాన్ని పరిశోధన అంశంగా తీసుకొని పీహెచ్డీ పూర్తి చేశాడు.ఈ పరిశోధనకు మార్గదర్శకులుగా ఓ. యూ తెలుగు శాఖ సీనియర్ ప్రొఫెసర్ డి. సూర్యా ధనంజయ్ వ్యవహరించారు. రాళ్ళబండి కవితాప్రసాద్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా భాద్యతలు నిర్వహించారు. వీరు పద్య కవిత్వం,వచన కవిత్వం,గేయ కవిత్వం లలో అనేక ఉత్తమ శ్రేణి రచనలు రచించారు.తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రముఖ ప్రాంతాల్లో అవధానంలు నిర్వహించారు.గొప్ప కవి,రచయిత,అవధాని,వక్త అయినటువంటి రాళ్ళబండి కవితాప్రసాద్ రచనల మీద చక్కని పరిశోధన చేసి,ప్రతిష్ఠాత్మక మైన ఓ యూ నుండి డాక్టరేట్ పొందినందుకు యడవల్లి సైదులును పలువురు అభినందించారు.తెలుగు సాహిత్యంలో సైదులుకు డాక్టరేట్ రావడం పట్ల కవులు,పరిశోధక విద్యార్థి మిత్రులు,అధ్యాపకులు శుభాకాంక్షలు తెలిపినారు.