అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన యాదవ జేఏసీ 

అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన యాదవ జేఏసీ 

విశ్వంభర, బషీర్ బాగ్ : అంబర్ పేట్ శ్రీనివాస్ యాదవ్ ను యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 13వ  తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న యాదవ రాజకీయ సదస్సు కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్  మాట్లాడుతూ ఈ నెల 13 తేదీన యాదవ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న యాదవ రాజకీయ సదస్సుకు పార్టీలకు అతీతంగా యాదవ ప్రజా ప్రతినిధులు, నాయకులు, నేతలు తప్పనిసరిగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అంజి యాదవ్, లీగల్ సెల్ అధ్యక్షుడు జుర్రు అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: