శుద్ధ నీటి ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ
విశ్వంభర, ఇనుగుర్తి: మండలంలోని మీట్యా తండాలో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ మంజూరీ చేయించిన రూ.5లక్షల పిలువగల నీటి శుద్ధి యంత్రం ఏర్పాటు కోసం అదే తండాకు చెందిన బిజెపి జిల్లా యువ నాయకులు గుగులోత్ నవీన్ నాయక్ సొంత ఖర్చుతో రూమ్ నిర్మిస్తున్నారు. దీనికోసం వేద బ్రాహ్మణునిచే గది నిర్మాణ శంకుస్థాపన పూజ చేశారు. ఈ సందర్భంగా నవీన్ నాయక్ మాట్లాడుతూ, తండా ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి, వారి చిరకాల కోరిక ను సాకారం చేస్తున్న హుస్సేన్ నాయక్ కు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. గది ఏర్పాటు చేస్తున్న నవీన్ నాయక్ ను తండావాసులు అభినందించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు బానోత్ వెంకన్న,గుగులోతు సుంద, నాయకులు బానోతు బాలు నాయక్, గుగులోతు వీరన్న,గుగులోతు శ్రీను, బానోతు వీరన్న,గుగులోతు ప్రేమ తదితరులు పాల్గొన్నారు.



