ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం  

ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం  


  విశ్వంభర, సూర్యాపేట: చివ్వేంల మండలంలోని వల్లభపురం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించుకోవడం వల్ల నష్టాలు తగ్గి లాభాలు పెరుగుతాయని పేర్కొన్నారు. వల్లభపురం పరిసర గ్రామాల రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సమయానికి ధాన్యం కొనుగోలు జరిగేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. రైతులు తమ వరి ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా శుభ్రపరచి తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ఇలాంటి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, చివ్వేంల మండల పార్టీ అధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, మాజీ సర్పంచ్ మొగదాల లక్ష్మణ్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బానోతు వెంకటి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, పిసిసి ఎస్సి సెల్ వైస్ చైర్మన్, మాజీ జెడ్పిటిసి చింతమళ్ల రమేష్, జిల్లా కాంగ్రెస్ వాణిజ్య సెల్ చైర్మన్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, సేవదల్ చీఫ్ ఆలేటి మాణిక్యం, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెన్న మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చెంచల నిఖిల్, నారాయణ ప్రవీణ్ రెడ్డి,నాగు నాయక్, మద్దెబోయిన శ్రీనివాస్, వాజిద్ మియా, ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: