సూర్యాపేటలో ఆపరేషన్ రోప్
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది వ్యాపారస్తులు రోడ్ల ను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించకూడదని సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి ఆపరేషన్ రోప్ కార్యక్రమంలో భాగంగా నియంత్రణ చర్యలు చేపట్టడం జరిగింది అని పట్టణ సీఐ వెల్లడించారు. రోడ్ల ఆక్రమణలు తొలగించడం వాహనదారులకు పాదాచార్యులకు సౌకర్యం కల్పించడం ఈ ఆపరేషన్ లోపు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. దీనిలో భాగంగా ఈరోజు సూర్యాపేట టౌన్ కొత్త బస్టాండ్ ప్రాంగణంలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు నిర్వహిస్తూ సామాన్య ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు కలిగించకూడదని కోరారు. రోడ్ల ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని రోడ్లు ఇరుకుగా తయారవుతున్నాయని అసౌకర్యాలకు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు.



