పదవులు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ లో లేదు

పదవులు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ లో లేదు

విశ్వంభర, సిద్దిపేట: నామినేటెడ్ పదవులను అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు  ఇమామ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీని నమ్ముకుని జెండా మోసిన ప్రతీ నాయకుడు, కార్యకర్తకు న్యాయం చేసేందుకు నామినేటెడ్ పోస్టులను నియమిస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్ష బీఆర్ఎస్  నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కంటే పూజల హరికృష్ణ నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందన్నారు. బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కుటుంబం 4 గ్రూపులుగా విడిపోయిందని, జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో గ్రూపులుండటం సహజమేనన్నారు. చిల్లర రాజకీయాలు మానుకుని బీఆర్ఎస్ హుందాగా వ్యవహరించాలని సూచించారు. మరోసారి కాంగ్రెస్ నాయకులు, పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో గ్యాదరి మధు, గయాజుద్దీన్, హర్షద్, హుస్సేన్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: