పిల్లలలో లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించాలి

పిల్లలలో లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించాలి

  •  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్

విశ్వంభర, మహబూబాబాద్:  ఐ.డి.ఓ.సి లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం, జిల్లా ఏర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్  కార్యక్రమాలపై సమీక్ష సమావేశం శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. రవి రాథోడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డా. రవి రాథోడ్ మాట్లాడుతూ, ఆర్‌బీఎస్‌కే కార్యక్రమం ద్వారా పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, వ్యాధులు, పోషకాహార లోపాలు, అభివృద్ధి ఆలస్యం ను తొందరగా గుర్తించి, తక్షణ చికిత్స అందించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. అలాగే  ఎర్లీ ఇంటర్ వెన్షన్  కేంద్రాల ద్వారా గుర్తించిన పిల్లలకు సమగ్ర వైద్య సేవలు, థెరపీ సేవలు సమయానికి అందించాలన్నారు. జిల్లాలోని అన్ని ఆర్‌బీఎస్‌కే టీమ్స్ పాఠశాలలు, ఆంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా సందర్శించి, పిల్లల ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, గుర్తించిన కేసులను వెంటనే ఎర్లీ ఇంటర్ వెన్షన్  కేంద్రాలకు రిఫర్ చేయాలని ఆదేశించారు. ఎర్లీ ఇంటర్ వెన్షన్  కేంద్రాల సేవలను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన వైద్య సహాయం అందించాలన్నారు. కార్యక్రమాల అమలులో ఉన్న పురోగతిని సమీక్షిస్తూ, లోపాలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని, సమన్వయంతో పని చేసి జిల్లాలో బాలల ఆరోగ్య సూచికలను మెరుగుపరచాలని డిఎంహెచ్ఓ  సూచించారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కె.వి. రాజు, హెచ్ఈఓ కేఎల్ఎన్ స్వామి, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Tags: