బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలి

  •  ఐసిడిఎస్ సూపర్ వైజర్ పుష్పలత

 విశ్వాంభర, పెద్ద శంకరంపేట: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్పలత, పెద్దశంకరంపేట సర్పంచ్ జంగం రేణుక లు అన్నారు. శుక్రవారం పెద్ద శంకరంపేట లోని పూసల గల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ  కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , అంగన్వాడి కేంద్రం ద్వారా అందుతున్న పథకాలను గర్భిణి స్త్రీలు బాలింతలు చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈనెల 9 నుండి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ పథకం ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరళ, అనురాధ,  సుజాత, ఏఎన్ఎంలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

Tags: