మహిళా సాధికారతపై అవగాహన
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సర్వేపల్లి గ్రామం మహిళా భవనంలో బోస్కో సేవా కేంద్రం, వేల్డ్ సౌజన్యంతో నీడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మహిళా అభివృద్ధి-సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నీడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కానుగంటి శ్రీశైలం మాట్లాడుతూ, మహిళా సాధికారత అంటే స్త్రీలు తమ జీవిత నిర్ణయాలను తామే తీసుకునేలా విద్య ఆర్థిక స్వాతంత్య్రం సామాజిక సమానత్వం చట్టపరమైన హక్కుల ద్వారా బలోపేతం కావడమన్నారు. స్త్రీలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా తాను స్వశక్తిపై విశ్వాసంతో ఆర్థిక రంగాలలో నిర్ణయాధికారం పొందడమే మహిళాభివృద్ధి మహిళా సాధికారత అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆర్డినేటర్ ఏ శిరీష,వీబీకే ఎ లావణ్య,భారతమ్మ, కవిత, కె చంద్రకళ,డి పద్మ, సత్తమ్మ, మనమ్మ, పెద్ద లక్ష్మి, పద్మ, తదితరులు పాల్గొన్నారు.



