అన్నా హజారేతో అవినీతి అంశాలపై చర్చ
On
విశ్వంభర, మహారాష్ట్ర : అవినీతి నిర్మూలనకు కఠిన చట్టాలు అవసరమని సామాజిక కార్యకర్త అన్నా హజారే సూచించారు. మహారాష్ట్రలోని ఆయన నివాసంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్. అరుణ్ కుమార్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అవినీతి, భూదాన్ భూములు, కాలేశ్వరం ప్రాజెక్టు పగుళ్లు, కొమ్మెర ఘటనపై చర్చించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా పారదర్శక పాలన ఉండాలని అన్నా హజారే సూచించినట్లు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్లలో రాజకీయ నాయకులు పాస్‌పోర్ట్ వివరాలు వెల్లడించే అంశంపైనా చర్చించినట్లు తెలిపారు.



