ఈత వనానికి నిప్పు

విశ్వంభర, చిక్కడపల్లి :హైదరాబాదు చిక్కడపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి. రమణ, రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టిసిఎస్ ఒకటో షాపుకు చెందిన వేలాది ఈత వనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఈత చెట్లను తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు జరిగిన నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. తాటి, ఈత, ఖర్జూర, గిరక, జీలుగు, పొట్టి వంగడాలను ప్రభుత్వం స్వయంగా నాటించి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులను రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం చేసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Tags: