కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
On
విశ్వంభర, సిద్దిపేట: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధిహామీ కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ కోరారు. ఎండలు తీవ్రమవుతున్న తరుణంలో గ్రామాల్లోని కూలీలకు మంచినీటి సౌకర్యాలు లేవని తెలిపారు. పార్టీ అసెంబ్లీ అధ్యక్షుడు కొండపలకల సంపత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశానికి యాదగిరి, ఉమేశ్ హాజరై మాట్లాడారు. మంచినీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ రోమాల బాబు, అసెంబ్లీ ఇన్‌ఛార్జి పంగ బాబు, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ముండ్రాతి లింగం, పట్టణ అధ్యక్షుడు గోపాల ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.



