ఆయుర్వేద సేవలు వినియోగించుకోవాలి

ఆయుర్వేద సేవలు వినియోగించుకోవాలి

  • జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

విశ్వంభర, మహబూబాబాద్:  ఆయుర్వేద, హోమియోపతి, యునాని సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్   అన్నారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆయుష్ దినోత్సవం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ,  ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో భాగంగా  ఆయుష్  ఆయుర్వేద, హోమియోపతి, యునాని సేవలు వినియోగించుకోవాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలు, హాస్టల్లలో యోగా శిక్షణ తరగతులు ఉదయం 6:30 నుంచి 7:30 వరకు నిర్వహించామని, అదేవిధంగా గ్రామస్థాయిలో ఆయుర్వేద హోమియో యునాని వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. శిబిరాలలో స్థానిక ఆయుష్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.  ఈరోజు హోమియోపతి దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరంలో హోమియోపతి వైద్యులు చైతన్య, రామకృష్ణ, ఆయుర్వేద వైద్యులు పి కిరణ్ కుమార్, వసుంధర దేవి, యునాని వైద్యులు బి శంకర్ డిపిమం శ్రవణ్ కుమార్, సిబ్బంది ఇందుమతి, పద్మ, అశోక్, సజయ్, మోహన్ పాల్గొన్నారు. ఈ శిబిరాన్ని ఆమె హనిమాన్ చిత్రపటానికి పుష్పమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. శిబిరంలో ఏర్పాటు చేసినటువంటి ఆయుర్వేద మొక్కల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి తులసి, వేప, ఉసిరి, ద్వారా ఉత్పత్తి అయ్యే మెడిసిన్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగానికి చెందిన డాక్టర్లు ప్రజలను పరిశీలించి వివిధ వైద్య సలహాలు సూచనలు అందించారు, ఈ శిబిరంలో 384 మంది వైద్య సేవలు పొందారు. జిల్లాలో 10 ఆయుష్ డిస్ప్లేనరీ ఉన్నాయని వాటి ద్వారా ముందుగా తెలిపిన షెడ్యూలు ప్రకారం ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ రవి రాథోడ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, ప్రసాద్, డాక్టర్ పి కిరణ్ కుమార్, జిల్లా ఆయుష్ ,శ్రవణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags: