గోడపత్రిక ఆవిష్కరణ 

గోడపత్రిక ఆవిష్కరణ 

 విశ్వంభర,  చార్మినార్:  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈనెల 25వ తేదీన  ఏర్పాటు చేయబోతున్న నూతన రాజకీయ పార్టీ గోడ పత్రికను చార్మినార్ నియోజకవర్గ ఇన్చార్జ్ పుప్పాల రాధాకృష్ణ చార్మినార్ వద్ద ఆవిష్కరించారు. కవితక్క తన ఆశయ సాధనలో సఫలీకృతం కావాలని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం గోడ  పత్రికను ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్ మహిళా అధ్యక్షురాలు ధరణి, వికాస్,అంబటి రాజేష్,మల్లేష్, పంకజ్,షిండే, మణికొండ విజయ్ కుమార్, భాను గంగపుత్ర,సంతోష్, నీరజ, ప్రియాంక,శారద,అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: