ఆకన్ పల్లి లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు 

ఆకన్ పల్లి లో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు 

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండలం ఆకన్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి  తన  సొంత నిధులతో ఐదు లక్షలతో  హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేయించారు. గ్రామంలో వీధి లైట్ల  సమస్యను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ లైట్లతో గ్రామ ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలోని  సీసీ రోడ్లను సాంక్షన్ చేసి సీసీ రోడ్డు పనులను కూడా పూర్తి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు కేఎల్ఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్ కమిటీ డైరెక్టర్ అవాజిగారి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కెర కృష్ణ, రంగారెడ్డి జిల్లా మహిళ సంఘం సభ్యురాలు అయిల్ల కమలమ్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రభు, సంజీవ, బాలమణి, కాట్రవత్ చిట్టిబాయి, కావాలి రమేష్, వీరెందర్, శ్రీనివాస్, కావాలి శేఖర్, కావాలి వెంకటేష్, చాకలి లక్ష్మణ్, నర్సింగ్ రావు, ప్రవీణ్ ,యాదయ్య, నర్సింహా, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Tags: