ప్రథమ వార్షికోత్సవానికి  ముస్తాబైన పేట రామాలయం

ప్రథమ వార్షికోత్సవానికి  ముస్తాబైన పేట రామాలయం

  విశ్వాంభర, పెద్ద శంకరంపేట: పెద్ద శంకరంపేట లోని శ్రీ సీతారామచంద్రస్వామి పునః ప్రతిష్ట ప్రథమ వార్షికోత్సవానికి రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రథమ వార్షికోత్సవ పురస్కరించుకొని శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు తెలిపారు. గణపతి పూజ పుణ్యాహవాచనం శ్రీరామ మూల మంత్ర వాహనము స్వామివారికి ప్రత్యేక అలంకరణ తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రథమ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని  స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజారి కనకరాజు ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు.

Tags: