హిందూ సమ్మేళనం బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ 

హిందూ సమ్మేళనం బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ 

విశ్వంభర, పరిగి:  పట్టణంలోని షిరిడి సాయిబాబా గుడి ఆవరణలో ఈనెల 19వ తేదీ న నిర్వహించనున్న  హిందూ సమ్మేళన బహిరంగ సభ   కరపత్రాన్ని హిందూ సమ్మేళనం అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు హనుమంతు ముదిరాజ్, కోశాధికారి మధుసూదన్ గుప్త , సమన్వయ సంఘ నాయకుడు వీరేశం, సమన్వయ సంఘ అధ్యక్షులు లింగమయ్య, కార్యదర్శి బాదాం శ్రీనివాస్ గుప్త, పెంటయ్య,  హిందూ సమ్మేళనం సంఘం కమిటీ ఆధ్వర్యంలో  రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హిందువులందరూ ఏకంగావాలని పరిగి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో భారీ హిందూ సమ్మేళన సభ నిర్వహిస్తామని  హిందూ సమ్మేళన సభకు  ప్రతి కడప కడప నుండి చిన్నలు పెద్దలు మహిళలు యువకులు విద్యార్థిని విద్యార్థులు హిందూ బంధువులు అందరూ ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసి మన ఐక్యతను చాటాలని తెలిపారు. హిందువుల ఐక్యతతో హిందూ ధర్మాన్ని ఆచరించడమే కాకుండా హిందువులపై దాడులు చేయడానికి ఎవరైనా వస్తే  ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

Tags: