అంకుసాపూర్‌లో విగ్రహాల ఊరేగింపు

అంకుసాపూర్‌లో విగ్రహాల ఊరేగింపు

 విశ్వంభర, తంగళ్ళపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో శుక్రవారం  విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మేళతాళాల నడుమ, భక్త జన సమూహం ఉత్సాహంగా పాల్గొంటూ గ్రామ వీధుల గుండా ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు భజనలు చేస్తూ, దేవతల నామస్మరణతో కార్యక్రమాన్ని మరింత ఆధ్యాత్మికంగా మార్చారు. గ్రామంలో ఈ ఊరేగింపు కార్యక్రమం భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

Tags: