గోడ పత్రిక ఆవిష్కరణ 

గోడ పత్రిక ఆవిష్కరణ 

 విశ్వంభర,  లాల్ దర్వాజా:   తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న నూతన పార్టీ ఆవిర్భావ సభకు తరలి రావాలని కోరుతూ యాకుత్పుర ఇన్చార్జ్ శైలజా గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోడపత్రికను ఆవిష్కరించారు. శైలజ గౌడ్ మాట్లాడుతూ రాబోయే కాలానికి కాబోయే మంత్రి కవిత అని అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాలను యువతి యువకులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్న ఈ తరం నవ యువ నేత అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా ప్రెసిడెంట్ ధరణి, యూత్ ప్రెసిడెంట్ శ్రీకర్, అనిల్ స్టూడెంట్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, సుచిత్ర,పరమేశ్వరి, సోను,శ్రీను,సంతోష్,గీత తదితర నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: