గంజాయి సమాచారం ఇస్తే రూ.5 వేలు బహుమతి
విశ్వంభర, నెల్లికుదురు: గంజాయి పై సమాచారం ఇచ్చుకో రూ.5,000 బహుమతిగా తీసుకో అంటూ జిల్లా పోలీస్ శాఖ ప్రకటించినట్లు స్థానిక ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపారు.పోలీస్ శాఖ యువత ఆరోగ్యం, భద్రత,భవిష్యత్తును కాపాడటానికి గంజాయి వినియోగం,అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా పోలీస్ శాఖ ఎస్పీ శబరిష్ ఆధ్వర్యంలో కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా గంజాయి సమాచారం తెలిసినవారు వెంటనే మొబైల్ నెం. 8712656999 ఫోను చేసి సమాచారం అందించాలని సూచించారు. జిల్లా ప్రజలకు సురక్షితమైన, డ్రగ్స్ రహిత వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యాలలో ఒకటన్నారు. గంజాయి మహమ్మారి నుండి మన ఊరిని, యువత భవిష్యత్తుని కాపాడేందుకు గంజాయి వినియోగం వంటి కార్యకలాపాలను గుర్తించి పూర్తిగా అరికట్టడానికి ప్రజల సహకారం అవసరమన్నారు. మీ చిన్న సమాచారం ఒక పెద్ద మార్పును తీసుకురాగలదు. మన యువతను కలిసి నెల్లికుదురు మండలం తో పాటు మహబూబాబాద్ జిల్లాను పూర్తిగా డ్రగ్స్ రహిత జిల్లాగా కాపాడుకుందామన్నారు.



