ఆపరేషన్ రోప్ ను సమర్థవంతంగా అమలు చేయాలి 

ఆపరేషన్ రోప్ ను సమర్థవంతంగా అమలు చేయాలి 

  • ఎస్పీ నరసింహ 

 విశ్వంభర, సూర్యాపేట: జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ప్రజల అవసరాల దృష్ట్యా రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉన్నదని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పీ లు, సూర్యాపేట పట్టణ, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ లు, ట్రాఫిక్ పోలీస్ లకు సమావేశం నిర్వహించిడం జరిగినది. పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించాలని రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను సర్దుబాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఆధునికరించాలని వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి పాదాచారులకు పౌరులకు వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమం నందు డిఎస్పీ లు ప్రసన్న కుమార్, శ్రీనీవాస్ రెడ్డి, సూర్యాపేట కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్ విధులను నిర్వర్తించే అధికారులు,సిబ్బంది వేసవికాలంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ అద్దాలు, సమ్మర్ కిట్లను  జిల్లా ఎస్పి కె.నరసింహ అందజేశారు . ఎండాకాలంలో ట్రాఫిక్ విధులను నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఎండ వేడిమి నుండి సరైన జాగ్రత్తలు పాటించాలని ఎస్పి సూచించారు. సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి ఎస్పీ  కళ్ళజోడు పంపిణీ చేశారు. సిబ్బంది ప్రతి ఒక్కరి పనితీరు గురించి ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లపై విధులు నిర్వర్తించేటప్పుడు తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కిట్లను అందజేయడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు. విధుల పరంగానైనా,వ్యక్తిగతంగానైనా ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎండ వేడిమి నుండి ఎప్పటికప్పుడు తమను తాము సంరక్షించుకోవాలంటే ఎక్కువగా నీళ్లు త్రాగాలని సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకై భాద్యతగా విధులు నిర్వరించాలని సూచించారు. కళ్ళజోళ్ళ పంపిణీ కార్యక్రమం నందు డి.ఎస్.పి నరసింహ చారి, ఇన్స్పెక్టర్లు వెంకటయ్య, శివశంకర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

Tags: