అట్టహాసంగా ఫేర్ వెల్ డే వేడుకలు
విశ్వంభర, హనుమకొండ: హన్మకొండ కిషన్ పుర లోని గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతున్న మొదటి,రెండో సంవత్సరం విద్యార్థులు మూడో సంవత్సరం విద్యార్థులకు ఫేర్ వెల్ డే వేడుకలు రాంనగర్ లోని అంబేద్కర్ భవన్లో శుక్రవారం ప్రిన్సిపాల్ వేణుమాధవ్ అధ్యక్షతన సరస్వతీ మాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతిప్రజ్వలన చేసి అట్టహాసంగా నిర్వహించినట్లు గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల డైరెక్టర్లు వేణుమాధవ్, శ్రీధర్ తెలిపారు.ఈ సందర్భంగా డైరెక్టర్ వేణుమాధవ్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థినిలు లక్ష్యసాధన కోసం సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. విద్యార్థినిలు సైబర్ సెక్యూరిటీ,ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్,డిజిటల్ మార్కెటింగ్, టూర్ అండ్ ట్రావెలింగ్,హాస్పిటల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పరిజ్ఞానాన్ని పెంచుకొని భవిష్యత్తులో మారుతున్న కాలానికి అనుగుణంగా ఐఐటీ, నిట్ లాంటి విద్యాసంస్థలలో ఇచ్చే సర్టిఫికెట్ కోర్సులను చదువుకుంటూ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగాల సాధనికి చక్కటి ప్రణాళికలతో,దృఢ సంకల్పంతో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం విద్యలో ప్రతిభ కనబరిచిన,రాష్ట్రంలోని ప్రభుత్వ అనుమతి పొందిన అనేక కంపెనీల ద్వారా సుమారు 200 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గీతాంజలి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



