ముదిరాజ్ సంఘం నాయకుల ముందస్తు అరెస్ట్  

 విశ్వాంభర, పెద్ద శంకరంపేట: గాంధీభవన్ ముట్టడికి తరలి వెళ్లుతున్న మండల ముదిరాజ్ సంఘం నాయకులను శుక్రవారం పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ, కామారెడ్డి డిక్లరేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ముదిరాజులను బీసీ ఏ చేర్చాలని, కోకాపేటలో 5 ఎకరాలలో ముదిరాజ్ భవన్ ను నిర్మించాలని, చట్టసభల్లో ముదిరాజులకు వాటా ఇవ్వాలని, జనాభా ప్రతిపాదికన ముదిరాజులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్న వారిలో ముదిరాజ్ సంఘం నాయకులు పున్నయ్య, వెంకటేశం, రవి, సాయిలు,సాయిరాం, అంజయ్య, తదితరులు ఉన్నారు.

Tags: