శ్రీరామగిరిలో చలివేంద్రం ప్రారంభం

శ్రీరామగిరిలో చలివేంద్రం ప్రారంభం

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని సర్పంచి మాదరి ప్రశాంత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి దృష్ట్యా ప్రయాణికులకు, అవసరం కోసం బయటికి వచ్చే వారికి, బాటసారు లకు, కూలీలకు,క ర్షకులకు దప్పిక నుండి ఉపశమనం కలిగించేందుకు మినరల్ వాటర్ తో కూడిన చలివేంద్రం ఏర్పాటు చేశామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి రామగిరి సుమన్, ఎస్ హెచ్ జి సిసి పద్మ, జిపిఓ విజయ్ కుమార్,విఏ ఓ లు శ్రీనివాస్,విజయలక్ష్మి,గ్రామస్థులు డోనికెన ఉప్పమ్మ, శీలం సంధ్య,నీలారపు యాకంభ్రం,కల్పన సిబ్బంది రామగిరి ఉప్పలయ్య, బందు వెంకన్న, బిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

Tags: