సీతారాముల పవిత్ర దాంపత్యం లోకకళ్యాణానికి ప్రతీక: ఎమ్మెల్యే మల్లారెడ్డి
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ శివారెడ్డి గూడా శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆలయంలో కొంతం అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సీతారాముల కల్యాణానికి మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, అనేక త్యాగాలతో నిలిచిన ఆ దివ్య బంధం తరతరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. శ్రీరాముడు, సీతాదేవి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, శాంతి సమృద్ధులతో జీవించాలని సమాజంలో ధర్మం, న్యాయం, నీతి విలువలు పెంపొందాలని ఆయన ఆకాంక్షించారు . ఘట్కేసర్ బి ఆర్ ఎస్ నాయకుడు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మన అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ఎన్ఎఫ్సీ నగర్ చౌరస్తాలో చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు .పోచారం సర్కిల్ చౌదరిగుడా శ్రీ రాములవారి ఆలయంలో చౌదరిగుడా మాజీ సర్పంచ్ బైరు రాములు రమాదేవి ఆధ్వర్యంలో సీతారాముల వారి కళ్యాణం ఘనంగా జరిగింది . ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.



