కాలభైరవునికి కూష్మాండ దీపారాధన

కాలభైరవునికి కూష్మాండ దీపారాధన

విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట మండలంలోని అరుర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ కాలభైరవ స్వామి కి అత్యంత ప్రీతికరమైన రోజు కలాష్టమి సందర్భంగా స్వామి వారికి  భక్తులు విశేష పూజలు నిర్వహించిన,చారు. కాలభైరవ స్వామి ఆలయ పూజారి మడుపతి సంతోష్ స్వామి ఉదయాన్నే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం భక్తులు ఈరోజు కలాష్టమి  సందర్భంగా శ్రీ కాలభైరవ స్వామి,మహాలక్ష్మి ,కుబేర స్వామి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆలయంలో కుష్మాండ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి మడుపతి సంతోష్ స్వామి మాట్లాడుతూ, ఈరోజు విశేషంగా ఆ కాలభైరవ స్వామిని దర్శించుకుని స్వామి ముందు దీపారాధన చేయడం వల్ల సకలపాపాలు తొలిగి ఆయురారోగ్యలు, భోగభాగ్యాలు, నర దిష్టితొలగి, ఆయురారోగ్యాలతో ఉంటారని అపారమైన నమ్మకం అని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజల కాకుండా దూర ప్రాంతాల నుండి సైతం భారీగా భక్తులు పాల్గొన్నారు.

Tags: