లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలి

లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలి

  •  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విశ్వంభర, జూబ్లీహిల్స్‌ : వేసవి నేపథ్యంలో నగరంలో తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కలెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్, మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో నీటి సరఫరా, మురుగునీటి పారుదలపై సమీక్షించారు. లీకేజీలను యుద్ధ ప్రాతిపదికన అరికట్టాలని, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. నగరంలో అమలవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పురోగతిని కూడా సమీక్షించారు. అంగన్‌వాడీలు, బస్తీ దవాఖానలు, ఆయుష్మాన్ భారత్ అమలు తీరుపై చర్చించారు. రహదారులు, ఫ్లైఓవర్ల పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, వర్షాకాలానికి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగర అభివృద్ధికి సంబంధించి వచ్చే మూడు నెలల కార్యాచరణపై ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు, దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Tags: