పంటల కొనుగోళ్లలో తాత్సారం చేయొద్దు

పంటల కొనుగోళ్లలో తాత్సారం చేయొద్దు

విశ్వంభర, సిద్దిపేట: కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దు తిరుగుడు పంటలను కొనుగోలు చేయకుండా రోజుల తరబడి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని బీఆర్ఎస్ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదేశాల మేరకు శుక్రవారం మండలకేంద్రంలోని పొద్దు తిరుగుడు మార్కెట్ కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాముని ఉమేశ్ చంద్ర, గ్రామశాఖ అధ్యక్షుడు పంపరి కనకయ్య, ఉప సర్పంచ్ కన్నారెడ్డిలతో కలిసి శుక్రవారం పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేసిన పాపానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, పొద్దు తిరుగుడు పంట తీసుకొచ్చి 20రోజుల పైనే అవుతుందన్నారు. నేటికి కూడా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దళారి వ్యవస్థతో ప్రభుత్వం, అధికారులు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే అనుమానం కలుగుతుందన్నారు.

Tags: