19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష  

19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష  

విశ్వంభర, నెల్లికుదురు: రాష్ట్ర మోడల్ పాఠశాలల్లో ప్రవేశపరీక్ష ఈ నెల 19న జరుగుతుందని నిర్వహిస్తున్నట్లు స్థానిక మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ జి.ఉపేందర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హాల్ టికెట్లు ఈ నెల 10 నుంచి telanganams.cgg.gov.in వెబ్‌సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 6వ తరగతికి  ఉదయం 10:00 గం.నుండి మధ్యాహ్నం 12:00గం. వరకు స్థానిక మోడల్ స్కూల్ లో పరీక్ష నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. 7వ,తరగతి నుండి 10వ,తరగతి వరకు: మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 4:00 వరకని తెలిపారు. పరీక్ష లో 100 ప్రశ్నలు (ఆబ్జెక్టివ్ విధానం), సమాధానాలు ఓఎంఆర్ షీట్‌పై గుర్తించాలని తెలిపారు. పరీక్ష రాసే విద్యార్థులు హాల్ టికెట్, ఎగ్జామ్ ప్యాడ్, బాల్ పెన్నులు, నీటి సీసా తో గంట ముందు హాజరుకావాలని సూచించారు.

Tags: