పూలే ఉత్సవ కమిటీ కన్వీనర్ గా మోదీరాందేవ్  

పూలే ఉత్సవ కమిటీ కన్వీనర్ గా మోదీరాందేవ్  

విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గా మాజీ ఎంపీ వి.హెచ్.హనుమంత రావు, కన్వీనర్ గా యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన (బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్) పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ ను నియమిస్తూ శుక్రవారం జీవో నం.174 జారీ చేయడం జరిగింది. నియామకం అనంతరం పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే మహనీయుని కమిటీలో చోటు దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, 16 సంవత్సరాలుగా విద్యార్థుల హక్కుల  కోసం తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసినందుకు గాను ప్రభుత్వం తనను గుర్తించి కన్వీనర్ గా బాధ్యతలు ఇచ్చిన ప్రభుత్వానికి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేశారు. రాష్ట్ర బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్, పూలే కమిటీ చైర్మన్ వి.హెచ్ హనుమంతరావు లకు, తన నియామకానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 11వ తేదీన రవీంద్రభారతిలో, జిల్లా కేంద్రాలతో పాటు ప్రతీ మండలం, గ్రామాలలో పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు.

Tags: