ఘనంగా కేఎస్ పీపీ  స్నాతకోత్సవం

ఘనంగా కేఎస్ పీపీ  స్నాతకోత్సవం

విశ్వంభర, హైదరాబాద్:  సంగారెడ్డి జిల్లా కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) నాలుగో స్నాతకోత్సవాన్ని శుక్రవారం  హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో నీతి ఆయోగ్ పూర్వ ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారతదేశపు జీ-20 షెర్పా అమితాబ్ కాంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో, ఆయన నూతన ఆవిష్కరణలు, సమగ్రత, దేశ నిర్మాణానికి ప్రాధాన్యత నిస్తూ, ప్రజా విధానం, పరిపాలనకు అర్థవంతంగా దోహదపడాలని పట్టభద్రులైన విద్యార్థులకు సూచించారు. తొలుత, ముఖ్య అతిథి, ఇతర ప్రముఖులు సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేయడంతో ఈ వేడుక లాంఛనంగా ప్రారంభమైంది. గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ తన అధ్యక్షోపన్యాసంలో, పట్టభద్రులను అభినందించి, ముఖ్య అతిథిని సత్కరించారు. కేఎస్ పీపీ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ కన్వాల్ అమితాబ్ ను పరిచయం చేశారు.మొత్తం 35 మంది విద్యార్థులకు వారి డిగ్రీలతో పాటు, విద్యా నైపుణ్యాన్ని గుర్తించే మెరిట్ పతకాలను ప్రదానం చేశారు.

Tags: